రాష్ట్రాల హక్కుల కోసం పోరాడుతున్న సీఎం కేసీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు: స్టాలిన్

-

తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్ర శేఖర్ రావు పుట్టిన రోజున దేశ నలుమూలల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రపతి, ప్రధాని మోదీలు సీఎం కేసీఆర్ కు ఫోన్ ద్వారా శుభాకాంక్షలు వెల్లడించారు. తెలంగాణలోనే కాకుండా పలు రాష్ట్రాల్లో కూడా కేసీఆర్ జన్మదిన వేడుకలను ఆయన అభిమానులు జరుపుకుంటున్నారు. గుజరాత్ సూరత్, యూపీ వారణాసి, ఢిల్లీల్లో ఆయన జన్మదిశ శుభాక్షాంక్షలు తెలుపుతూ.. కటౌట్లు ఏర్పాటు చేశారు.

తాజాగా తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, సీఎం కేసీఆర్కు బర్త్ డే విషెస్ తెలిపారు. రాష్ట్రాల హక్కులు, ప్రాంతీయ స్వయంప్రతిపత్తి కోసం నిరంతరం పోరాడుతున్న నాయకుడు గౌరవ కె.చంద్రశేఖర్ రావు గారికి జన్మదిన శుభాకాంక్షలని.. మనమందరం సహకార సమాఖ్య విధానాన్ని, రాజ్యాంగం హామీ ఇచ్చిన రాష్ట్రాల గౌరవాన్ని కాపాడేందుకు కృషి చేద్దాం అంటూ… ట్విట్టర్ లో వ్యాఖ్యానించారు.

ఇటీవల కేసీఆర్కి మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే, తమిళనాడు సీఎం స్టాలిన్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతాబెనర్జీలు కాల్ చేసి ఎన్డీయేతర ముఖ్యమంత్రుల సమావేశం ఏర్పాటు చేద్ధామని.. బీజేపీని ఎదురిద్దాం.. మతపరశక్తులను అడ్డుకుందాం అంటూ.. అండగా ఉంటామని హామీ కూడా ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version