సీఎం కేసీఆర్ ఎప్పుడైనా బయట పర్యటించడం చూశారా? కొండగట్టులో అంత పెద్ద ప్రమాదం జరిగినా, ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నా, హైదరాబాద్‌లో అంతగా వరదలు వచ్చినా ఆయన బయట కనిపించలేదు. అంతెందుకు గతేడాదిగా కరోనా విజృంభిస్తున్నా ఏ ఒక్క హాస్పిటల్‌ను కూడా విజిట్ చేయలేదు. ప్రగతిభవన్ నుంచే పాలన సాగించారు సీఎం కేసీఆర్.
కానీ ఇప్పుడు ఎందుకో ఆయన గేర్ మార్చినట్టు తెలుస్తోంది. ఈటల రాజేందర్‌ను మంత్రి వర్గం నుంచి తొలగించినప్పటి నుంచి ఊహించని నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఫీవర్ సర్వే చేయించడం, ఆయుష్మాన్ భారత్ అమలు, సీఎం హోదాలో తొలిసారి గాంధీకి వెళ్లడం ఇవన్నీ ఆలోచింపజేస్తున్నాయి.
ఈ రోజు కూడా వరంగల్‌లోని ఎంజీఎం హాస్పిటల్‌కు సీఎం కేసీఆర్ వెళ్తున్నారు. అలాగే సెంట్రల్ జైల్ ను కూడా పరిశీలిస్తారు. ఇవన్నీ చూస్తుంటే కేసీఆర్ మళ్లీ తన గ్రాఫ్‌ను పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రతిపక్షాల విమర్శలకు చెక్ పెట్టేందుకు, ఈటల లాంటి వారిని తీసేసినా తన ఇమేజ్ తగ్గకుండా చూసుకునేందుకు, ప్రజల్లో ఉద్యమ కాలం నాటి ఇమేజ్‌ను మళ్లీ సంపాదించుకోవాలని చూస్తున్నారు. మరి ముందు ముందు ఇంకెన్ని సందర్శిస్తారో చూడాలి.