BREAKING : ఇవాళ సాయంత్రం ముచ్చింతల్ కు సీఎం కేసీఆర్

-

రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మండలం ముచ్చింతల్‌ లో నిన్నటి ననుంచి భగవద్రామానుజల సహస్రాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. శ్రీ రామానుజాచార్యలు 216 అడుగుల విగ్రహం స్టాచ్యూ ఆఫ్‌ ఈక్వాలిటీ ఆవిష్కరణకు సన్నాహాలు పూర్తి అయ్యాయి. ముచ్చింతల్‌ గ్రామంలోని చిన్నజీయర్‌ స్వామి ఆశ్రమంలోని 40 ఎకరాల సువిశాల ప్రాంగణంలో ఈ కార్యక్రమం జరుగుతోంది.

అయితే.. ఈ కార్యక్రమానికి ఇవాళ సాయంత్రం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ వెళ్లనున్నారు. ఈ సందర్భంగా శ్రీ రామానుజాచార్యలు విగ్రహాన్ని సందర్శించి.. చిన్నజీయర్‌ స్వామి ఆశీర్వాదం తీసుకోనున్నారు. అనంతరం తిరిగి ప్రగతి భవన్‌ కు చేరుకుంటారు. ఇక సీఎం కేసీఆర్‌ పర్యటన నేపథ్యంలో… అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. ఇది ఇలా ఉండగా.. ప్రధాని మోడీ సైతం ఎల్లుండి ముచ్చింతల్‌ గ్రామానికి రానున్నారు. ఎల్లుండి ఉదయం 11 గంటల సమయంలో ప్రధాని మోడీ రానున్నారు.అంతేకాదు.. ఫిబ్రవరి 7 వ తేదీన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా కూడా హైదరాబాద్‌ రానున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version