ఎడిట్ నోట్ : ఎందుకీ సైలెన్స్ బాల‌య్యా!

-

చంద్ర‌బాబు ఏంచెబితే అదే పాటిస్తాను అని అంటున్నారు బాల‌య్య.నేరుగా సీన్లోకి రాకుండా ఉండేందుకే ఇష్ట‌ప‌డుతున్నారు బాల‌య్య.అందుక‌నే హిందూపురంవ‌ర‌కే తాను ప‌రిమితం అన్న విధంగా కీల‌క వ్యాఖ్య‌లు చేసి వార్త‌ల్లో నిలుస్తున్నారు.

ఎన్టీఆర్ పేరును కొత్త గా ఏర్ప‌డ‌నున్న కృష్ణా జిల్లాకు పెడ‌తామ‌ని చెబుతున్నారు జ‌గ‌న్. దీనిపై బాల‌య్య స్పందించ‌లేదు. మాట్లాడ‌లేదు.వారసుడి హోదాలో ఏ మాటా చెప్ప‌కుండా ఉండడం కూడా ఓ విధంగా ఆశ్చ‌ర్య‌మే! ఇదే స‌మ‌యంలో బాల‌య్య సోద‌రి పురంధ‌రి మాత్రం స్పందించారు. ట్విట‌ర్ వేదిక‌గా త‌న మ‌ద్ద‌తు తెలియ‌జేశారు కూడా!

వివాదంలో ఎందుకు దూరడం అని తార‌క్ అస్స‌లు ఎక్క‌డా క‌నిపించ‌లేదు మ‌రియు వినిపించ‌లేదు. ఆ విధంగా తార‌క్ ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌ల‌లో భాగంగా ఉండిపోయాడు. ఇక హిందూపురం ఎమ్మెల్యేగా ఉన్న బాల‌య్య ఒక వాదం మాత్రం వినిపించారు. ఏంటంటే తాను ప్రాతినిధ్యం వ‌హిస్తున్న హిందూపురం నియోజ‌క‌వ‌ర్గాన్ని జిల్లా కేంద్రంగా ఉంచుతూ స‌త్య‌సాయి జిల్లాను ఏర్పాటు చేయాల‌ని కోరారు.

ఇప్ప‌టికే పుట్ట‌ప‌ర్తిని జిల్లా కేంద్రంగా చేస్తూ స‌త్య సాయి జిల్లాను ముఖ్య‌మంత్రి ప్ర‌తిపాదించిన సంగ‌తి విధిత‌మే! కానీ హిందూపురం వాసులు మాత్రం ఇందుకు అంగీకారం ఇవ్వ‌డం లేదు. దీంతో వ‌రుస నిర‌స‌నల కార్య‌క్ర‌మాల‌ను అన్నడ హిందూపురం జిల్లా సాధ‌న స‌మితి చేప‌డుతోంది. అదేవిధంగా పౌర‌జీవ‌నాన్ని కూడా స్తంభింప‌జేసేందుకు సిద్ధం అవుతోంది.

అయితే ఈ నిరస‌నల్లో ఎక్క‌డా బాల‌య్య క‌నిపించ‌లేదు. ఎందులోనూ ఆయ‌న పాల్గొన‌లేదు. ఈ నేప‌థ్యంలో హిందూపురం ప్ర‌జ‌లు ఎవ‌రికి వారే త‌మంత‌ట తాము ముందుకు వ‌చ్చి నిర‌స‌ల్లో పాల్గొంటున్నారే త‌ప్ప! బాల‌య్య రాక‌పై మాత్రం వాళ్ల‌కు అస్స‌లు న‌మ్మ‌కాలే లేవు అని కూడా తేలిపోయింది.

ఇక జిల్లాల ఏర్పాటుకు సంబంధించి రేగుతున్న వివాదంలో బాల‌య్య ఒక్క‌సారి వీడియో విడుద‌ల చేసి సైలెంట్ అయిపోయారు. ఆ వీడియోలో కూడా ఎక్క‌డా ఎన్టీఆర్ జిల్లా గురించి చెప్ప‌లేదు. అదేవిధంగా ఎన్టీఆర్ పేరు స్మ‌ర‌ణ కూడా చేయ‌లేదు. కొత్త జిల్లాల ఏర్పాటును స్వాగ‌తిస్తున్నాం అని చెబుతూనే త‌న‌దైన అభ్యంత‌రాలు చెప్పారు. ఓ విధంగా ఇది టీడీపీ లైన్ అనే చెప్పాలి.

అంతేకాదు చంద్ర‌బాబు ఆదేశాల‌కు అనుగుణంగానే బాల‌య్య ఉన్నార‌ని కూడా చెప్పాలి. పూర్తిగా చంద్ర‌బాబు ఏం చెబితే అదే అన్న విధంగా బాల‌య్య త‌న ప్ర‌వ‌ర్త‌న‌ను, న‌డ‌వ‌డిని మార్చుకున్నార‌ని కూడా భావించాలి. దీంతో హిందూపురం ఉద్యమం వైపు బాల‌య్య వెళ్తారేమో కానీ కృష్ణా జిల్లా రాజ‌కీయా్లలో మాత్రం ఆయ‌న త‌ల‌దూర్చ‌రు. ఓ విధంగా వాటికి ఆయ‌న దూరంగానే ఉండ‌నున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version