నేడు బీహార్ కు వెళ్లనున్న సీఎం కేసీఆర్…షెడ్యూల్ ఇదే

-

తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్‌ బీహార్‌ పర్యటనకు ముహుర్తం ఫిక్స్‌ అయింది. ఇవాళ, రేపు అంటే.. బుధవారం, గురువారం ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు బీహార్ పర్యటన చేపట్టనున్నారని ప్రగతి భవన్‌ వర్గాలు పేర్కొన్నాయి. ఇందులో భాగంగా… ఇవాళ ఉదయం పూట హైదరాబాదు నుండి పాట్నా కు బయలుదేరి వెళ్లనున్నారు తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్‌.

గతంలో ప్రకటించిన మేరకు, గాల్వాన్ ఘర్షణల్లో అమరులైన 5 గురు బీహార్ కు చెందిన భారత సైనికుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేయనున్నారు కేసీఆర్‌. సైనిక కుటుంబాలతో పాటు.. ఇటీవల, సికింద్రాబాద్ టింబర్ డిపో అగ్ని ప్రమాదంలో చనిపోయిన 12 మంది బీహార్ వలస కార్మికుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేయనున్నారు సీఎం కెసిఆర్.

బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తో కలిసి సీఎం కేసీఆర్ చెక్కులు పంపిణీ చేయనున్నారు. అనంతరం.. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఆహ్వానం మేరకు, మధ్యాహ్నం లంచ్ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు. ఈ సందర్భంగా జాతీయ రాజకీయాలపై ఇరువురు ముఖ్యమంత్రులు చర్చించనున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version