ఈ నెల 18 నుంచి ప్రారంభ కానున్న పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో, ఉభయ సభల్లో టిఆర్ఎస్ పార్టీ అనుసరించాల్సిన విధివిధానాల పై దిశానిర్దేశం చేసేందుకు, టిఆర్ఎస్ పార్లమెంట్ (రాజ్యసభ, లోక్ సభ) సభ్యులతో, రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రగతిభవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సమావేశం కానున్నారు.
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాల పై పోరాడాలని ఎంపీలకు పిలుపివ్వనున్న సిఎం కెసిఆర్ :
ఈ సందర్భంగా..లోక్ సభ రాజ్యసభల్లో టిఆర్ఎస్ ఎంపీలు అవలంబించవలసిన పలు కీలక అంశాలపై సిఎం కెసిఆర్ వారికి దిశానిర్దేశం చేయనున్నారు.తెలంగాణకు అన్ని రంగాల్లో నష్టం చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న తెలంగాణ ప్రజా వ్యతిరేక విధానాలను దనుమాడుతూ పార్లమెంటు ఉభయసభల్లో తీవ్ర నిరసనను ప్రకటిస్తూ, పార్లమెంటు వేదికగా పోరాటానికి పూనుకోవాలని టిఆర్ఎస్ ఎంపీలకు సిఎం కెసిఆర్ దిశానిర్దేశం చేయనున్నారు.
ఆర్ధికంగా క్రమశిక్షణను పాటిస్తూ అనతి కాలంలో అభివృద్ధి పథంలో పయనిస్తున్న తెలంగాణ రాష్ట్రాన్ని ప్రోత్సహించాల్సింది పోయి ఆర్థింకగా అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేయాలని కేంద్రం కుటిల ప్రయత్నాలు చేస్తుండడం పట్ల తెలంగాణ ప్రజా ఆకాంక్షలను అద్దం పడుతూ ఉభయ సభల్లో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టాలని ఎంపీలకు సిఎం కెసిఆర్ సూచించనున్నారు.