తెలంగాణలో కేసీఆర్‌కు వ్యతిరేకంగా రాజకీయాలు నడుస్తున్న విషయం తెలిసిందే. ఇంతకాలం ఆయనకు పాజిటివ్‌గా నడిచిన రాజకీయం..ఇప్పుడు నెగిటివ్‌గా నడుస్తోంది. ఓ వైపు బీజేపీ, మరోవైపు కాంగ్రెస్ పార్టీల దాడి పెరిగింది. ముఖ్యంగా బీజేపీ..టీఆర్ఎస్‌తో ఢీ అంటే ఢీ అనేలా ముందుకు నడుస్తోంది. అదే సమయంలో కేసీఆర్ ప్రభుత్వంపై ప్రజల్లో కూడా వ్యతిరేకత పెరుగుతుంది. అలాగే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై కూడా వ్యతిరేకత వస్తుంది.
అంటే టోటల్‌గా కేసీఆర్‌కు గడ్డుకాలం నడుస్తుందని చెప్పొచ్చు. అయితే ఈ పరిస్తితుల నుంచి కేసీఆర్ కూడా గట్టిగానే ట్రై చేస్తున్నారు. రాజకీయ అపార చాణక్యుడు అయిన కేసీఆర్..రాజకీయ వ్యూహాలు పన్ని..పరిస్తితులని తనకు అనుకూలంగా మార్చుకోవడంలో ధిట్ట. అందుకే ఇప్పుడు నెగిటివ్ పరిస్తితులని కూడా మార్చడానికి కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే క్రమంలో ఆయన కొంత డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. తమ ప్రభుత్వంపై వచ్చిన నెగిటివ్‌ని తొలగించడానికి ప్రతిపక్షాలని ట్రాప్ చేసినట్లే కనిపిస్తోంది.
ఎందుకంటే ఇటీవల కొన్ని ఇష్యూలని చూస్తే అదే నిజమనిస్తుంది. మామూలుగానే బీజేపీ దూకుడుగా వెళుతున్న విషయం తెలిసిందే. అయితే ఒక్క బండి సంజయ్ అరెస్ట్‌తో… బీజేపీ పోరాడే మిగతా విషయాలు డైవర్ట్ అయ్యాయి… కేవలం అరెస్ట్ గురించే బీజేపీలో చర్చ నడుస్తోంది. అరెస్ట్ వల్ల బండి సంజయ్‌కు కాస్త బెనిఫిట్ వచ్చింది… కానీ ఆ అరెస్ట్ వల్ల మిగతా సమస్యలు పక్కకు వెళ్ళిపోయినట్లు కనిపిస్తోంది.
అటు కాంగ్రెస్ పార్టీ వల్ల సొంత విభేదాలతోనే కిందా మీదా పడుతున్నారు. పార్టీలో జగ్గారెడ్డి ఇష్యూ ఏ మేర నడుస్తుందో తెలిసిందే. అసలు జగ్గారెడ్డి అనే నిప్పు పుట్టించిందే కేసీఆర్ అన్నట్లు ప్రచారం వస్తుంది. అలా కాంగ్రెస్‌ని కట్టడి చేసేశారు. అయితే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఎంతసేపు కేసీఆర్‌పై విమర్శలు చేయడంపైనే ఫోకస్ పెడుతున్నాయి తప్ప… స్థానిక సమస్యలు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేల వల్ల స్థానికంగా ఉండే ఇబ్బందులని హైలైట్ చేయడంలో విఫలమవుతున్నారు. ఏదేమైనా కేసీఆర్ ట్రాప్ సక్సెస్ అయినట్లే కనిపిస్తోంది.