తెలుగు వారందరికి సీఎం కేసిఆర్ ఉగాది పర్వదిన శుభాకాంక్షలు

-

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు శోభకృత్ నామ ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. వ్యవసాయ సంవత్సరంగా పరిగణించే ఈ ఉగాది.. రైతులకు, ప్రజలకు అన్ని రంగాల్లో శుభాలను చేకూర్చనున్నదని సిఎం కెసిఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. సాగునీరు, తాగునీరు, పచ్చని పంటలతో తెలంగాణలో నిత్య వసంతం నెలకొన్నదని సీఎం తెలిపారు.

వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడం ద్వారా దాని అనుబంధ రంగాలు, వృత్తులు బలపడి, తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టమైందని సిఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ సాధించిన ప్రగతి దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. ‘శోభకృత్’ నామ సంవత్సరం లో తెలంగాణతో పాటు భారతదేశం మరింత గొప్పగా అభివృద్ధి సాధించాలని సిఎం కేసీఆర్ ఆకాంక్షించారు..

Read more RELATED
Recommended to you

Exit mobile version