మంగళవారం సాయంత్రం ఒక్కసారిగా తెరాస వర్గాల్లో కలకలం రేగింది. తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ కి అస్వస్థత అనే వార్తతో ఒక్కసారి తెరాస శ్రేణులు కలవరానికి గురయ్యాయి. సుమారు 9 గంటల సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను యశోదా ఆస్పత్రికి తీసుకురాగా ఆయన వెంట ఆయన సతీమణి కూడా ఆస్పత్రికి వచ్చారు. అక్కడి నుంచి సుమారు గంట పాటు కెసిఆర్ కు,
వివిధ రకాల వైద్య పరిక్షలు వైద్యులు నిర్వహించారు. ప్రత్యేక వైద్యుల బృందం పరీక్షలు నిర్వహించింది. ఆ తర్వాత టెస్ట్ రిపోర్ట్ లు అన్నీ పరిశీలించిన తర్వాత ఆయనకు ఏ ఇబ్బంది లేదని. సాధారణ జ్వరం అని వైద్యులు స్పష్టం చేసారు. విశ్రాంతి తీసుకోవాలని ఆయనకు సూచించారు. ఆయన ఆరోగ్యానికి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదని, కార్యకర్తలు ఎవరూ ఆందోళన చెందవద్దని,
తెరాస నాయకులు అంటున్నారు. కాగా ఇదిలా ఉంటే సంక్రాంతి పండుగ కోసం ముఖ్యమంత్రి ఎర్రవెల్లి వెళ్లగా, రెండు రోజుల నుంచి జ్వరంగా ఉండడంతో నిన్న సాయంత్రం 5.30 గంటలకు హైదరాబాద్ తిరిగి వచ్చారు. ఈ తరుణంలో రాత్రి సమయంలో శరీర ఉష్ణోగ్రత బాగా పెరగడంతో పాటు, హైబీపీ కూడా వచ్చి౦ధని సమాచారం. దీంతో కుటుంసభ్యులు వెంటనే సీఎంను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారు.