బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కరోనా కట్టడి విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. బెంగాల్ లో ముస్లిం లు ఎక్కువగా ఉన్నా వారు ఢిల్లీ మత ప్రార్ధనలకు వెళ్ళినా సరే వారికి మాత్రం కరోనా వైరస్ సోకినా ఆమె చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఆమె ఢిల్లీ స్థాయిలో అత్యంత వేగంగా సమాచారాన్ని సేకరించారు. వారు ఎక్కడ ఉన్నారు అనేది ఆమె చాలా వేగంగా గుర్తించారు.
స్వయంగా ముఖ్యమంత్రి రంగంలోకి ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షా సమావేశాలను నిర్వహించారు. వారి నుంచి వివరాలను తెలుసుకోవడమే కాకుండా స్వయంగా క్వారంటైన్ సెంటర్లకు తరలించడానికి ఆమె స్వయంగా రంగంలోకి దిగి వారితో చర్చలు జరిపారు. నేరుగా ముస్లిం మత పెద్దలతో మాట్లాడారు. రాష్ట్రాన్ని కాపాడుకుందాం మీ గురించి నేను చూసుకుంటా అని వారికి స్పష్టమైన హామీ ఇచ్చారు.
బయటకు రాకపోతే ఎం జరుగుతుందో కూడా ఆమె వారికి అదే స్వరంతో చాలా గట్టిగా చెప్పారు. దీనితో చాలా మంది స్వచ్చందంగా బయటకు వచ్చారు. లాక్ డౌన్ ని కూడా ఆమె చాలా పక్కాగా అమలు చేస్తున్నారు. ఆకస్మిక తనిఖీలకు దిగారు. ప్రజల కష్టాలను నేరుగా తెలుసుకున్నారు మమత. స్వయంగా వాడలలో పర్యటనలు చేసి ప్రజలకు ఆమె ధైర్యం చెప్పడమే కాకుండా వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. దీనితో బెంగాల్ లో కరోనా చాలా తక్కువగా ఉంది.