చాయ్ తాగే మా సమస్యలు పరిష్కరిస్తానని మాట తప్పిన సీఎం రేవంత్..

-

కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వస్తే చాయ్ తాగేలోపు తమ సమస్యలను పరిష్కరిస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పాడని.. అరగంట, గంట ఎక్కువ పనిచేసి కేసీఆర్‌ను గద్దె దించండని అన్నారని సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యలు పరిష్కరించకుండా కాలం వెల్లదీస్తున్నారని, ప్రజాపాలన పేరిట మమ్మల్ని పట్టించుకోవడం లేదని ఫైర్ అయ్యారు.టీచర్స్, నాన్ టీచింగ్ స్టాఫ్ రోడ్ల మీదకు రావడం వల్ల కేజీబీవీ విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారని, సీతక్క వచ్చి ఖచ్చితంగా 20వేల సమగ్ర శిక్ష ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామని అప్పుడు చెప్పారని ఇప్పుడేమో మాట తప్పారన్నారు.

మేము ధర్నా చేస్తుంటే.. రేవంత్ రెడ్డి మెదక్ చర్చికి పోతున్నాడని మా టెంట్లు పీకేశారని.. మమ్మల్ని సీఎంకు కలిపిస్తా అని చెప్తే వెళ్ళాము, కానీ కలవకుండానే కారు ఎక్కి వెళ్ళిపోయాడని గుర్తచేశారు. సీఎం రేవంత్ రెడ్డి దయ చేసి మా సమస్య పరిష్కరించాలని సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు వేడుకుంటున్నారు. అమ్మ, నాన్న లేని వాళ్లను కేజీబీవీలో వదిలేసి వెళ్తుంటారు. ఇపుడు మేమందరం 20రోజులగా ధర్నాలో పాల్గొనడం వలన వాళ్ళకి చదువు చెప్పే వాళ్లు, తిండి పెట్టే వాళ్ళు ఎవరు లేక పిల్లలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news