తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల సీఎంల ప్రవర్తన తీరుపై సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు సీరియస్ అవుతున్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు జరుగుతున్న సమయంలో ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్ వచ్చిన సందర్భంగా ప్రధాని మోడీ సహా అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్ సైతం లేచి నమస్కారం చేయగా.. తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీల సీఎంలు రేవంత్ రెడ్డి, సిద్దరామయ్య, సుఖ్విందర్ సింగ్ ముగ్గురు కనీసం లేచి నిలబడలేదు కదా.. కూర్చొని కూడా నమస్కరించకపోవడం గమనార్హం.
అందుకు సంబంధించిన విజువల్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఉపరాష్ట్రపతి వచ్చిన సమయంలో కనీసం లేచి నిల్చోవడం కూడా తెలీదా? అని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. సీఎం స్థాయిలో ఉన్నవారు ఇలా ప్రవర్తిస్తే మిగతా వారి పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు.
వివాదాస్పదంగా మారిన తెలంగాణ, కర్ణాటక సీఎంల తీరుపై విమర్శలు చేస్తున్న నెటిజన్లు
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు జరుగుతున్న సమయంలో ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్ వచ్చిన సమయంలో ప్రధాని మోడీ సహా అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్ సైతం లేచి నమస్కారం చేయగా.. తెలంగాణ, కర్ణాటక, హిమాచల్… pic.twitter.com/o2fNkCrNBq
— Telugu Scribe (@TeluguScribe) December 28, 2024