రాష్ట్రంలో అక్రమంగా తరలిస్తున్న ఇసుక రవాణాపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. ఇక మీదట ఎవరైనా రీచ్‌ల నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తే వారిపై ఉక్కుపాదం మోపాలని జిల్లాల కలెక్టర్లు, సంబంధిత అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీచేశారు.
ఇసుక రీచ్‌లను ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు స్పష్టం చేశారు. ఓవర్ లోడ్, అక్రమ రవాణాపై విజిలెన్స్ దాడులు చేపట్టాలని, ప్రభుత్వ ఆదాయానికి అక్రమార్కులు గండికొట్టకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రతి జిల్లాల్లో ప్రత్యేకంగా ఇసుక రవాణాపై స్పెషల్ మానిటరింగ్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు ఇచ్చారు.