ప్రధాని మోడీకి ఎదురెళ్తే రేవంత్ రెడ్డికి పచ్చడే : బూర నర్సయ్య గౌడ్

-

రాష్ట్ర బీజేపీ కీలక నేత, మాజీ మంత్రి బూర నర్సయ్య గౌడ్ సీఎం రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..ప్రధాని నరేంద్రమోడీకి రేవంత్ రెడ్డి అడ్డొచ్చినా..రేవంత్‌కే ప్రధాని అడ్డొచ్చినా పచ్చడి అయ్యేది తెలంగాణ సీఎంకే అని వ్యాఖ్యానించారు.

సీఎం రేవంత్ రెడ్డి కుల అహంకారంతో మాట్లాడుతున్నారని, మోడీతో పెట్టుకుంటే మసైపోవడం ఖాయమన్నారు. మోడీ కాదు..రాహుల్ ఇల్లీగల్ కన్వర్టెడ్ గాంధీ అని హాట్ కామెంట్స్ చేశారు. కాగా, ఇటీవల సీఎం రేవంత్ మాట్లాడుతూ.. ప్రధాని మోడీ అగ్రకులానికి చెందిన వ్యక్తి అని.. లీగల్లీ కన్వర్టెడ్ బీసీ అని ఆయన చేసిన వ్యాఖ్యలపై తాజాగా బూర నర్సయ్య గౌడ్ కౌంటర్ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news