ఏపీలోని అల్లూరి జిల్లా పాడేరులోని సెయింట్ ఆన్స్ స్కూల్ హాస్టల్లో ర్యాగింగ్ కలకలం రేపింది. ఏడో తరగతి బాలికపై టెన్త్ విద్యార్థినులు దాడికి పాల్పడ్డారు.ఈ విషయం బయటకు తెలియడంతో ర్యాగింగ్‌కు పాల్పడిన విద్యార్థినిలపై స్కూల్ యాజమాన్యం సీరియస్ అయ్యింది.
దాడికి పాల్పడిన ముగ్గురిని హాస్టల్ నుంచి ఇంటికి పంపేయాలని సిబ్బందిని మేనేజ్మెంట్ ఆదేశించింది.ఈ ఘటనపై విద్యా శాఖ అధికారులు విచారణ చేపట్టారు.ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. ప్రస్తుతం ర్యాగింగ్‌కు సంబంధించి విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అల్లూరి జిల్లా పాడేరులోని సెయింట్ ఆన్స్ స్కూల్ హాస్టల్లో ర్యాగింగ్ కలకలం.
ఏడో తరగతి బాలికపై టెన్త్ విద్యార్థినులు దాడి.
దాడికి పాల్పడిన ముగ్గురిని హాస్టల్ నుంచి ఇంటికి పంపేయాలని సిబ్బందిని ఆదేశం.
ఈ ఘటన పై విచారణ చేపట్టిన విద్యా శాఖ అధికారులు. ఇలాంటి ఘటనలు… pic.twitter.com/dcVm70EvT0
— greatandhra (@greatandhranews) February 17, 2025