డీప్ ఫేక్ తో సమాజంలో చిచ్చు పెట్టాలని చూస్తున్నారు : సీఎం రేవంత్

-

సైబర్ సేఫ్టీ లో తెలంగాణ రాష్ట్రాన్ని నెంబర్ వన్ స్థానంలో చూడాలి అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సైబర్ నేరాల ఆర్థిక వ్యవస్థ పై కూడా తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. తెలంగాణ ను సురక్షిత బిజినెస్ హబ్ గా చూడాలి. 1930 టోల్ ఫ్రీ నెంబర్ పై ప్రతీ ఒక్కరూ అవగాహన పెంచుకోవాలి.. పోలీసులు కూడా మరింత అవగాహన కల్పించాలి. ఈ కార్యక్రమం అత్యంత కీలకమైనది. నేరాల రూపు మరింత మారుతోంది. సమాజంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా పరిపాలన లో కూడా మార్పు రావాలి.

ఒకప్పుడు దోపిడీ చేయాలి అంటే.. దొంగలు తలుపులు బద్దలు కొట్టి మన ఇంట్లోకి ప్రవేశించాలి. కానీ ఇప్పుడు జరుగుతున్న దోపిడీ.. అలా కాదు. ఒక్క క్లిక్ తో నిలువునా దోచేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. సైబర్ సేఫ్టీ విషయంలో తెలంగాణ పోలీసులు చాలా అప్రమత్తంగా ఉన్నారు. కేంద్రం కూడా గుర్తించి అవార్డులు ఇచ్చింది. కానీ.. ఇది సరిపోదు. ఇక డీప్ ఫేక్ తో.. సమాజంలో చిచ్చు పెట్టాలని చూస్తున్నారు. దేశం మొత్తం ఒక కో ఆర్డినేషన్ తో సైబర్ నేరాలను ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. సైబర్ నేరాలకు నియంత్రించడంలో తెలంగాణ ఆదర్శంగా నిలుస్తుందని భావిస్తున్నా అని సీఎం పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news