ఆరాంఘర్ జూ పార్క్ ఫ్లై ఓవర్ ప్రారంభం కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక కామెంట్స్ చేసారు. అప్పట్లో మా రాజశేఖర్ రెడ్డి హయంలో పీవీ ఎక్సప్రెస్ అతిపెద్ద ఫ్లై ఓవర్ నిర్మించుకున్నాము. ఇప్పుడు అదే తరహాలో తెలంగాణ ఏర్పడ్డాక రెండవ అతిపెద్ద ఫ్లై ఓవర్ నిర్మించుకున్నము. మనకు మనమే సాటి అన్నట్లు చెప్పుకోవడానికి ఇది ఒక్కటి చాలు. హైదరాబాద్ సిటీ కి లేక్స్ అండ్ రాక్స్ సిటీగా నిజాం హయాంలో ప్రపంచానికి చాటి చెప్పారు. ఇప్పుడు నగరంలో చిన్న వర్షం వచ్చినా కూడా మునిగిపోయే పరిస్థితి వచ్చింది. మూసి నదిని పునరుద్ధించుకోవాల్సిన అవసరం ఉంది.
అక్బరుద్దీన్ నా చిన్న నాటి స్నేహితుడు. హైదరాబాద్ డెవలప్మెంట్ కోసం MIM, కాంగ్రెస్ కలిసి పనిచేస్తుంది. చిన్న చిన్న నగరాల్లో కూడా మెట్రో కనెక్టివిటీ ఉంది. ఓల్డ్ సిటీ కి మెట్రో కావాలని మోది తో కోట్లాది మెట్రో ను తీసుకువస్తున్నా. రీజనల్ రింగ్ రోడ్డు ఓపెన్ ఐతే మరింత డెవలప్ అవుతుంది. మోడీతో కొట్లాడాల్సివస్తే కొట్లడుతా. అసదుద్దీన్ తో కలవాల్సి వస్తే.. కలుస్తా. త్వరలో MIM ఎమ్మెల్యేలను, ఎంపీలను, MLC లను సెక్రటేరియట్ కి పిలిచి అధికారులతో భేటీ చేయిస్తా అని సీఎం రేవంత్ పేర్కొన్నారు.