రేపు తిరుమలకు సీఎం రేవంత్ రెడ్డి

-

సీఎం రేవంత్ రెడ్డి రేపు (గురువారం) తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్తున్నట్లు తెలుస్తోంది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శినం కోసం సీఎం రేవంత్ తిరుపతి వెళ్తారని సమాచారం. ముందుగానే తిరుమల దేవస్థానం అధికారులకు సమాచారం ఇవ్వడంతో టీటీడీ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది.

తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ బాధ్యతలు చేపట్టిన వెంటనే సీఎం తిరుమల శ్రీవారిని కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్న విషయం తెలిసిందే. ఇదిలాఉండగా, నిన్న రాత్రి వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీ సందర్బంగా తొక్కిసలాట జరిగిన సందర్భంగా సీఎం రేవంత్.. తిరుమల దర్శనానికి వస్తుండటంతో అక్కడ పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేసినట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news