టీటీడీ, విజిలెన్స్ అధికారుల నిర్లక్ష్యం వల్లనే తొక్కిసలాట : రోజా

-

టీటీడీ, విజిలెన్స్ అధికారుల నిర్లక్ష్యం వల్లనే తొక్కిసలాట జరిగిందని మాజీ మంత్రి రోజా పేర్కొన్నారు. తాజాగా ఆమె మీడియాతో మాట్లాడారు. భక్తుల మీద ప్రేమ ఉంటే.. 6గురు ఎవరివల్ల చనిపోయారో ప్రభుత్వాన్ని నిలదీయండి. ప్రభుత్వ బాధ్యతా రాహిత్యానికి ఇది నిదర్శనం అన్నారు. తిరుమల లడ్డూలో కల్తీ జరుగకపోయినా తప్పుడు ప్రచారం చేశారు.

చంద్రబాబుతో రాజీనామా చేయిస్తారా..? మీరు బాధ్యత తీసుకొని రాజీనామా చేస్తారా..? టీటీడీ చైర్మన్ తో రాజీనామా చేయిస్తారా..? నిజమైన సనాతనధర్మం పాటించినట్టయితే ఇప్పుడు రా అన్నారు. చంద్రబాబు ఎప్పుడూ అధికారంలోకి వస్తే.. అప్పుడు ఎన్నో చావులు చూడాల్సి వస్తుందని అన్నారు. గతంలో గోదావరిలో 29 మంది మరణించిన విషయం తెలిసిందే. విజయవాడ వరదల్లో 60 మందికి పైగా చనిపోయారు. చంద్రబాబు అసమర్థతతో ఈ ఘటన స్పష్టమవుతోంది. తప్పు చేసిన వారి మీద క్రిమినల్ కేసులు పెట్టాలని ఆమె డిమాండ్ చేశారు. తిరుపతి అమ్మాయి గా చాలా బాధ వేస్తుంది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం మొదటిసారి అని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news