మద్యం మత్తులో బస్సు నడిపిన డ్రైవర్.. పీఎస్‌లో కండక్టర్ ఫిర్యాదు

-

మద్యం మత్తులో డ్రైవర్ బస్సును నడిపి ప్రయాణికుల ప్రాణాలతో పాటు తోటి ఉద్యోగి అయిన కండక్టర్ లైఫ్‌ను కూడా ప్రమాదంలో పడేశారు. బస్సుకు మూడు చోట్ల ప్రమాదం తప్పినట్లు సమాచారం. ఎట్టకేలకు డ్రైవర్ బస్సును నిలపడంతో తోటి ఉద్యోగి కండక్టర్ డ్రైవర్ మీద పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

పూర్తి వివరాల్లోకివెళితే..మంచిర్యాల నుంచి ఆసిఫాబాద్‌కు వెళ్తున్న ఎక్స్‌ప్రెస్ బస్సు డ్రైవర్ ఆజాగ్రత్తగా నడిపి ప్రయాణికులను భయాందోళనకు గురిచేశాడు. అతను మద్యం మత్తులో ఉన్నాడని కండక్టర్ ఆరోపించాడు. అంతేకాకుండా లిఖిత పూర్వకంగా ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బస్సుకు మూడు చోట్ల ప్రమాదం తప్పిందని, అందులో మహిళలు, పిల్లలు సైతం ఉన్నారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ మేరకు కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news