సీఎం రేవంత్ రెడ్డి కేంద్రాన్ని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు..ఫైర్ అయినా మంత్రి కిషన్ రెడ్డి

-

అసెంబ్లీలో కేంద్ర బడ్జెట్ కేటాయింపులపై ఇవాళ వాడీ వేడి చర్చ జరిగింది. బుధవారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..ఎన్నో పోరాటాలు చేసి రాష్ట్ర ప్రజలు తెలంగాణ సాధించుకున్నారని కేంద్రంలోని బీజేపీ మన హక్కులను పట్టించుకోలేదని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.

ఈ క్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ..కేంద్రాన్ని తిట్టడానికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చర్చ పెట్టినట్లుందని మండిపడ్డారు.రేవంత్ తన తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి కేంద్రాన్ని బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ధ్వజమెత్తారు .ఏపీ రాజధాని అభివృద్ధికి నిధులు కేటాయించడం సంతోషం అని కేంద్ర బడ్జెట్‌పై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని ఆయన అన్నారు. రేవంత్ కారణంగానో, కేసీఆర్ దయ వల్లో బీజేపీ గెలవలేదని ,హామీలు అమలు చేయాలని అడిగితే కుంటిసాకులు చెబుతున్నారని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.తెలంగాణలో బీజేపీకి 35శాతం ఓట్ షేర్ వచ్చిందని.. నీతి ఆయోగ్‌ను బహిష్కరిస్తామనడాన్ని రేవంత్ విజ్ఞతకే వదిలేస్తున్నా అని ఆయన అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news