అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి వర్సెస్ కేటీఆర్ మధ్య మాటల యుద్ధం..

-

తెలంగాణ అసెంబ్లీ మాటల తూటాలకు వేదికగా మారింది. అధికారపక్షం ప్రతిపక్షం మధ్య నువ్వా నేనా అన్నట్లుగా మాటలు యుద్ధం కొనసాగుతోంది. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగిందంటూ అసెంబ్లీలో సభ్యులు మాట్లాడుతుండగా.. సీఎం రేవంత్ రెడ్డికి, టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కి మధ్య కాసేపు మాటలు యుద్ధం నడిచింది.. అసెంబ్లీలో కీలక చర్చ నడుస్తున్న నేపథ్యంలో ప్రతిపక్ష నేతగా ఉన్న కెసిఆర్ రాకపోవడం అన్యాయమని, తెలంగాణ ప్రజలను అవమానించినట్లు అయిందని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించగా.. దానికి కేటీఆర్ దీటుగా సమాధానం ఇచ్చారు.. తామడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలని, దానికి కెసిఆర్ రావాల్సిన అవసరం లేదంటూ కేటీఆర్ బదులు ఇవ్వడంతో.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు..

కేంద్రంలో ఉండే బిజెపి ప్రభుత్వానికి టిఆర్ఎస్ పార్టీ అనుకూలంగా పని చేసిందంటూ సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు చేశారు.. నోట్ల రద్దు తో పాటు, రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బిజెపికి అనుకూలంగా బిఆర్ఎస్ ఓట్లు వేసిందన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ది మేనేజ్మెంట్ కోటా అంటూ వ్యాఖ్యానించడంతో.. దానికి కేటీఆర్ స్పందించారు.. రేవంత్ రెడ్డి పేమెంట్ కోటాలో సీఎం అయ్యారు అంటూ విమర్శించారు.. వీరిద్దరి మధ్య జరిగిన మాటల యుద్ధంతో అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్ గా జరిగాయి..

విభజన సమయంలో తెలంగాణ హక్కుల కోసం ఎంతో పోరాటం చేశామని, కేంద్రంలో మోడీ సర్కార్ అధికారంలో ఉన్నప్పటికీ తాము ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదంటూ కేటీఆర్ అసెంబ్లీలో మాట్లాడారు.. కాంగ్రెస్ పార్టీ మాత్రం తెలంగాణ హక్కులని కాపాడుకునేందుకు కేంద్రాన్ని యాచిస్తోందంటూ విమర్శించారు.. కేంద్ర ప్రభుత్వం సహకారం అందించక పోయినా తెలంగాణని తాము ఎంతో అభివృద్ధి చేశామని, చీకటి ఒప్పందాలకు తాము ఎప్పుడూ పోలేదంటూ ఆయన అన్నారు.. భారతీయ జనతా పార్టీ పై తాము విమర్శలు చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ తమపై విమర్శలు చేయడం సరికాదంటూ కేటీఆర్ హితవు పలికారు.. వీరిద్దరి మధ్య జరిగిన మాటల యుద్ధం కాసేపు ఆసక్తికరంగా మారింది..

Read more RELATED
Recommended to you

Latest news