ప్రజా ప్రభుత్వం కాదు.. ప్రజలను మోసం చేసే ప్రభుత్వం : కిషన్ రెడ్డి

-

ఇది ప్రజా ప్రభుత్వం కాదు.. ప్రజలను మోసం చేసే ప్రభుత్వం అని కాంగ్రెస్ పై విమర్శలు చేసారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. కాంగ్రెస్ చేతల ప్రభుత్వం కాదు మాటల ప్రభుత్వం, కోతల ప్రభుత్వం. రైతు భరోసా లో కోతలు పెట్టే కుట్రలు చేస్తున్నారు. రైతు లు, రైతు కూలీలు, కౌలు రైతులు ఎందరు ప్రభుత్వం దగ్గర డేటా ఉంది. దద్దమ్మ ప్రభుత్వం… రైతుల నుండి దరఖాస్తులు ఎందుకు. ఫసల్ భీమా ఊసే లేదు. రైతు భరోసా కింద ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు.

రైతుల మీద అక్రమ కేసులు పెట్టీ.. రైతులకు సంకెళ్లు వేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. అప్పుడు brs రైతులకు సంకెళ్లు వేస్తే ఇప్పుడు కాంగ్రెస్ సర్కారు వేస్తుంది సంకెళ్ళ్ళు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతులకు అండగా ఉంది. నవంబర్ 30న నాలుగో విడత రుణమాఫీ చేస్తున్నట్టు రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఆ డబ్బులు ఇంకా రైతుల అకౌంట్ లలో చేరలేదు. ఇంకా నాలుగు సంవత్సరాలు అయిన రుణమాఫీ కాదు. రైతు వ్యతిరేక చర్యలకు పాల్పడుతోంది.. ఈ ప్రభుత్వానికి అధికారుల మీద అజమాయిషీ లేదా అని ప్రశ్నించారు కిషన్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version