TS ను TG గా మార్చుతూ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు

-

ఈరోజు డా. బి. ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో జరిగిన కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వాహనాల నంబర్ ప్లేట్లపై ఉండే TSని TGగా మార్చనుంది. ఇక నుండి టీఎస్ స్థానంలో ‘టీజీ’ దర్శనమివ్వనుంది.దీంతో పాటుగా ఈ భేటీలో కేబినెట్ పలు నిర్ణయాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.రాష్ట్ర గేయంగా ‘జయజయహే తెలంగాణ’ను నిర్ణయించింది. కాగా ఈ నెల 8 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నారు.

ఈ సమావేశానికి మంత్రి శ్రీధర్ బాబు తో పాటు మంత్రులు శ్రీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎమ్మెల్సీ శ్రీ జీవన్ రెడ్డి, శ్రీ దామోదర రాజనర్సింహ,ఎమ్మెల్యేలు శ్రీ సుదర్శన్ రెడ్డి, శ్రీ రోహిత్ రావు, శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే శ్రీ ఏ. చంద్రశేఖర్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈనెల 8 నుంచి బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది. తాత్కాలిక బడ్జెట్ ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version