కమ్యూనిస్టు దిగ్గజం, సిపిఐ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. సురవరం సుధాకర్ రెడ్డి అనారోగ్య సమస్యల కారణంగా నిన్న రాత్రి కన్నుమూశారు. దీంతో సురవరం సుధాకర్ రెడ్డికి కమ్యూనిస్టులు, రాజకీయ నాయకులు సంతాపం తెలుపుతున్నారు. కాగా, రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు అంత్యక్రియలకు ఏర్పాటు చేయాలని సిఎస్ కు ఆయన సూచనలు జారీ చేశారు.

కాగా, రేపు మధ్యాహ్నం మూడు గంటల వరకు హిమాయత్ నగర్ లోని మగ్ధూం భవన్ లో భౌతిక కాయాన్ని ఉంచరున్నారు. ఆ తర్వాత గాంధీ కాలేజీకి సురవరం సుధాకర్ రెడ్డి భౌతిక కాయాన్ని అప్పగిస్తారు. సురవరం సుధాకర్ రెడ్డి భౌతిక కాయాన్ని అప్పగించే ముందు పోలీసులు అధికార లాంఛనాలతో గౌరవ వందనం సమర్పిస్తారు. ఇదిలా ఉండగా సురవరం సుధాకర్ రెడ్డికి తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు.