CM Revanth Reddy reached Mumbai: ముంబై చేరుకున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఇవాళ ఉదయం ముంబై బయలు దేరిన సీఎం రేవంత్ రెడ్డి.. కాసేపటి క్రితమే చేరుకున్నారు.ఇక మహారాష్ట్ర పీసీసీ కార్యాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్విందర్ సింగ్ సుక్కు, ఏఐసీసీ జాతీయ మీడియా కమిటీ ఛైర్మన్ పవన్ ఖేరా, డీసీసీ అధ్యక్షులు రోహిన్ రెడ్డి తదితరులు…సమావేశమయ్యారు.
ఇవాళ సాయంత్రం వరకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి… ముంబైలోనే ఉండనున్నారు. నవంబర్ 20న మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.ఈ నేపథ్యంలో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలు, ఎన్నికల మ్యానిఫెస్టోపై సలహాలు వంటి పలు విషయాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. కాగా, ఈ ఎన్నికలలో రేవంత్ స్టార్ క్యాంపెయినర్ గా ఉన్నారు. ఇది ఇలా ఉండగా.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పుట్టిన రోజు కావడంతో పలువురు జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, పలువురు మంత్రులు, ప్రతిపక్షనేతలు ఇలా అందరూ శుభాకాంక్షలు చెప్పారు. కానీ కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ మాత్రం ఇప్పటివరకు రేవంత్ రెడ్డి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పకపోవడం గమనార్హం.