బీసీసీఐ సంచలన నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. టీమిండియా హెచ్ కోచ్ విషయంలో మరోసారి సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. వేర్వేరు ఫార్మాట్లకు వేర్వేరు హెడ్ కోచ్‌లను నియమించాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో కూడా భారత్ ఓడితే టెస్టులకు, టీ20, వన్డేలకు వేర్వేరుగా కోచులను నియమించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
గతంలో ఎన్నడూ బీసీసీఐ ఇలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఒకవేళ తీసుకుంటే భారత క్రికెట్ చరిత్రలో సంచలనానికి తెరలేపనుంది. అందుకు ప్రస్తుతం హెడ్ కోచ్ గా వ్యవహరిస్తున్న గౌతమ్ గంభీర్ సమ్మతిస్తారా? లేక మొత్తానికే తప్పుకుంటారా? అనేది తెలియాల్సి ఉంది. కాగా, ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌ను భారత్ 3-0 తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే.ఈ క్రమంలోనే బీసీసీఐ ఈ మేరకు ఆలోచన చేసినట్లు సమాచారం.