శరీరానికి పోషకాలను సమకూర్చే సొయాచిక్కుడు.. ఈ వ్యాధులకు రక్షణ ఇదే

-

సోయా చిక్కుడు ఒక మంచి పప్పు ధాన్యం. ఈమధ్య కాలంలోనే ప్రజలు దీన్ని ఎక్కువగా వాడుతున్నారు.. వైద్యుల సైతం సోయా పదార్ధాలను సిఫార్సు చేస్తున్నారు. దీనిని ఆహారంగా తీసుకోవటం వల్ల శరీరానికి కావాల్సిన మాంసంకృత్తులు తేలికగా అందుతాయట. సోయా చిక్కుడు వలన అనేక ఆరోగ్యపరమైన లాభాలున్నాయని వివిధ పరిశోధనలో తేలింది. మీకు తెలుసా.. 250 గ్రాముల సోయా చిక్కుళ్లలోని మాంసకృత్తులు దాదాపు 2 లీటర్లు పాలు, లేదా 1 కిలో మాంసం, లేదా 24 గ్రుడ్లలో వుండే మాంసకృత్తులకు సమానమట. ఓమెగా-3 , 6 ఫాటీ యాసిడ్స్ సోయా నూనెలో పుష్కలంగా లభిస్తాయి. సోయా చిక్కుడులోని పీచు రక్తంలోని కొలెస్ట్రాల్, చక్కెరను నియంత్రిస్తుంది. ఇన్ సాల్యుబుల్ ఫైబర్ మల పరిమాణమును పెంచుటం వలన ప్రేవు క్యాన్సరు నివారించబడుతుందట..

క్యాన్సర్ నుంచి రక్షణ

ఆహరంలో సోయాచిక్కుడు కనీసం ఒకసారైన తీసుకోవటం చాలా మంచిదట. అనేక రకాల క్యాన్సర్ వ్యాధుల నుండి రక్షణ పొందవచ్చు అని పరిశోధనల్లో తేలింది. సోయాలో ఐరన్, కాల్షియం సమృద్దిగా ఉండటం వలన గర్బిణీ స్త్రీలకు, బాలింతలకు చాలా పుష్టికరము. పిల్లలకు సోయా పదార్దాలను రోజూ ఇవ్వటం వలన మానసిక, శారీరక పెరుగుదలకు తోద్పడుతుంది. దీనివలన పిల్లలలో బరువు. ఎత్తు, జ్ఞాపకశక్తి, రక్తంలో హిమోగ్లోబిన్ పరిమాణం సమృద్ధిగా లభిస్తుంది.

కప్పు గింజలు 6గుడ్లకు సమానం..

అకాల వృద్దాప్య లక్షణాలు రాకుండ నివారించడంలో సోయా బేషుగ్గా పనిచేస్తుంది. కప్పు సోయా గింజల్లో 240 గ్రాముల మాంసం, 180 గ్రాముల చేపలు, 8 కప్పుల పాలు, 6 గుడ్లకు సమానమైన మాంసకృత్తులు అందుతాయట. పాలీ అన్ సాచురేటెడ్ ఫ్యాట్ లను కలిగి ఉండడం వలన సోయా వంటి ఆహర పదార్దాలు నేరుగా శరీరంలో ఉండే ఎల్ డి ఎల్ స్థాయిలను తగ్గిస్తాయి. సోయా ఉత్పత్తులు ఫైటో ఈస్ట్రొజెన్ కలిగి ఉండటంతో..ఇది పురుషులలో టెస్ట్రొస్టిరాన్ హార్మోన్ ఉత్పత్తిని నిరోధిస్తుంది.

రోగనిరోధక శక్తి పెంచేందుకు

సోయా చిక్కుళ్లు.. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. సహజసిద్ద డిటర్జెంట్లుగా పేర్కోనబడే సాపోనిన్ లను సోయా ఉత్పత్తులు కలిగి ఉంటాయి. అంతేకాకుండా ఈ సాపోనిన్ లు సూక్ష్మజీవులను చంపి, రోగనిరోధక వ్యవస్థను పటిష్ఠం చేస్తాయి. బరువు తగ్గాలనుకునేవారు కూరల్లో వేసుకొని తీసుకుంటే ఆకలి నియంత్రణలో ఉంటుందట.

రొమ్ము క్యాన్సర్ కు పరిష్కారం..

సోయా చిక్కుడు రోమ్ము క్యాన్సర్ ను తగ్గిస్తుంది. సోయా ఉత్పత్తులు ఐసోప్లావనాయిడ్స్ లను కలిగి ఉంటాయి. ఇవి ఫైటో ఈస్ట్రోజెన్ లాగా వ్యవహరిస్తాయి. ఫైటో ఈస్ట్రొజెన్ అనే రసాయనకాలు ఈస్ట్రొజెన్ చర్యను తటస్థీకరణం చేసి, ట్యూమర్ ఏర్పడడాన్ని తగ్గిస్తుంది, డిఎన్ ఎ మార్పులలో జరిగే రెట్టింపును ఇది నివారిస్తుంది. పసిపిల్లలకు తల్లిపాలు పడనప్పుడు సోయా పాలను కొంచెం ఇస్తే మంచిదట.. వీటిలో పిల్లల ఎదుగుదలకు ఉపయోగపడే పోషకాలు పుష్కలంగా లభిస్తాయి.

ఎప్పుడూ తినే రొటీన్ కూరలతోపాటు..అప్పుడప్పుడు ఇలాంటివి కూడా ట్రై చేస్తూ ఉంటే..శరీరాన్ని అన్ని పోషకాలు అందుతాయి కదా..ఈ సారి మార్కెట్ కు వెళ్లినప్పుడు ఇవి కూడా కొనడానికి ట్రై చేయండి.

Read more RELATED
Recommended to you

Latest news