తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరోసారి మహారాష్ట్రకు వెళ్లనున్నారు. మహారాష్ట్ర ఎన్నికల సందర్భంగా ఇండియా కూటమి తరఫున ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి మరోసారి మహారాష్ట్రకు వెళ్తున్నట్లు సమాచారం. శుక్రవారం రాత్రి లేదా శనివారం సీఎం మహారాష్ట్రకు వెళ్లనున్నారు. ముూడు రోజుల పాటు కూటమి అభ్యర్థుల విజయం కోసం ఎన్నికల ప్రచారం చేయనున్నారు.
ఇప్పటికే పలు ధఫాలుగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్‌గా మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రచారం సాగించారు. అంతకుముందు శివసేన (యూబీటీ) అభ్యర్థి ఆదిత్య ఠాక్రేకు మద్దతుగా రేవంత్ బుధవారం ముంబైలోని వర్లీలో రోడ్‌షో నిర్వహించిన విషయం తెలిసిందే. ఈనెల 20న మహారాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికల పోలింగ్ జరగనుంది.
ఆ రాష్ట్ర శాసనసభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ స్టార్ క్యాంపెనర్ రేవంత్‌కు స్వాగతం పలికేందుకు అక్కడి నేతలు దారిపొడవునా ఫ్లెక్లీలు ఏర్పాటు చేశారు.