ఏపీ అసెంబ్లీలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. అసెంబ్లీకి మంత్రులు ఆలస్యంగా రావడంపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. క్వశ్చన్ అవర్ని మంత్రులు సీరియస్గా తీసుకోవాలని.. సమయపాలన పాటించాలని హితవు పలికారు. అసెంబ్లీకి మంత్రులు ఆలస్యంగా రావడంపై స్పందించిన స్పీకర్ అయ్యన్నపాత్రుడు మళ్లీ రిపీట్ కావొద్దని పేర్కొన్నారు.

క్వశ్చన్ అవర్ ని మంత్రులు సీరియస్ గా తీసుకోవాలని ఆదేశించారు అయ్యన్నపాత్రుడు. మంత్రులే ఆలస్యం గా వస్తే ఎలా? అంటూ నిలదీశారు అయ్యన్నపాత్రుడు. ఇప్పుడు ఈ సంఘటన హాట్ టాపిక్ అయింది. ఎమ్మెల్యేలు కూడా సభను సజావుగా జరిగేలా సూచించారు. వైసీపీ ఎమ్మెల్యేలు రాకపోయినా.. మన బాధ్యత నెరవేర్చాలని స్పీకర్ అయ్యన్న పాత్రుడు కోరారు.
ఏపీ అసెంబ్లీలో ఆసక్తికర ఘటన
అసెంబ్లీకి మంత్రులు ఆలస్యంగా రావడంపై స్పీకర్
అయ్యన్నపాత్రుడు అసంతృప్తిక్వశ్చన్ అవర్ని మంత్రులు సీరియస్గా తీసుకోవాలని.. సమయపాలన పాటించాలని హితవు@AyyannaPatruduC #APAssembly #Ayyannapatrudu #Bigtv pic.twitter.com/QsJZZ6n6cN
— BIG TV Breaking News (@bigtvtelugu) November 15, 2024