డ్రగ్స్ నియంత్రణపై సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. డ్రగ్స్ నియంత్రణ పైన పోలీస్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సమన్వయంతో పనిచేయాలని ఆయన సూచించారు.డ్రగ్స్ విక్రయిస్తున్న విదేశీయులపై కఠిన చర్యలు తీసుకోవాలని ,హైదరాబాద్ నగర శాంతిభద్రతలపై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు.
సీఎం రేవంత్ రెడ్డితో కలెక్టర్లు, ఎస్పీ తెలంగాణ సచివాలయంలో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో మానవ అక్రమ రవాణా నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని , పోలీస్ స్టేషన్ల పరిధిలో పీస్ కమిటీలను పునరుద్ధరించాలని ,బాధితుల పట్ల ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండాలి.. క్రిమినల్స్‌తో కాదని తెలిపారు.
డ్రంకన్ డ్రైవ్ తో పాటు డ్రైవ్ ఆన్ డ్రగ్స్ కూడా ఉండాలని ,హైదరాబాద్ నగరంలో రాత్రి పూట ఫుడ్ కోర్ట్‌ల విషయంలో ఇబ్బంది రానివ్వొద్దని రేవంత్ రెడ్డి సూచించారు. రుణమాఫీ అమలుపైన కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ చూపించాలని తెలిపారు. నిర్లక్ష్యం కారణంగా ఏ ఒక్క రైతుకు నష్టం జరగొద్దని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు.