హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన ఎమ్మెల్సీ కవిత

-

లిక్కర్ స్కామ్ కేసులో తీహార్ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అనారోగ్యానికి గురి అయ్యారు. గత రెండు రోజులుగా జ్వరంతో బాధపడుతోన్న ఎమ్మెల్సీ కవిత ఇవాళ నీరసంతో కళ్లు తిరిగిపడిపోయింది. దీంతో అధికారులు వెంటనే కవితని ఢిల్లీలోని దీన్ దయాళ్ హాస్పిటల్ కి తరలించారు. ఆసుపత్రిలో వైద్యులు కవితకు చికిత్స అందించారు. ప్రస్తుతం కవిత ఆరోగ్యం కుదుటపడటంతో డాక్టర్లు డిశ్చార్జ్ చేశారు. దీంతో అధికారులు ఆమెను మళ్లీ తీహార్ జైలుకు తరలించారు. కవిత క్షేమంగా ఉన్నారని తెలియడంతో బీఆర్ఎస్ కార్యకర్తలు ఊపీరి పీల్చుకున్నారు.

కాగా, దేశంలో సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం జ్యుడిషియల్ రిమాండ్‌లో భాగంగా ఢిల్లీలోని తీహార్ జైల్లో ఉన్న కవిత ఈ కేసులో బెయిల్ కోసం పలుమార్లు కోర్టును ఆశ్రయించగా నిరాశే ఎదురైంది. ట్రయల్ కోర్టు, ఢిల్లీ హైకోర్టులో ఊరట దక్కకపోవడంతో కవిత దాదాపు 4 నెలలుగా తీహార్ జైల్లోనే ఉన్నారు. దీంతో ఇక బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించే యోచనలో కవిత ఉన్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version