కల్కి ఓటీటీ రిలీజ్ పై క్లారిటీ ఇచ్చిన మేకర్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

-

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్, దీపికా పదుకొణె జంటగా నటించిన సినిమా కల్కి.600 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ పాన్ ఇండియా మూవీ దాదాపు 1000 కోట్లకి పైన వసూళ్లను ఇప్పటివరకు రాబట్టింది. ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతాన్ని అందించాడు. వైజయంతి మూవీ బ్యానర్ పై అశ్విని దత్ నిర్మించారు.

ఇక తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఓటీటీ విడుదల గురించి చిత్ర యూనిట్ క్లారిటీ వచ్చేసింది. తాము ఏ డిజిటల్ ప్లాట్ఫామ్కి అయితే సినిమాని అమ్మామో ఆ డిజిటల్ ప్లాట్ఫామ్లో..ఈ చిత్రం విడుదల అయిన 10 వారాల తర్వాత మాత్రమే స్ట్రీమింగ్‌కు అందుబాటులో ఉంటుందని వెల్లడించింది. అంటే, జూన్ 27 థియేటర్లో రిలీజైన ఈ సినిమా సెప్టెంబరు రెండవ వారంలో స్ట్రీమింగ్‌కు వచ్చే అవకాశం ఉంది. దీంతో సినీ లవర్స్ కు ఇంకొన్ని రోజులు నిరీక్షణ తప్పదు.కల్కి తెలుగు, కన్నడ,తమిళం, మలయాళం వెర్షన్‌లు అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో స్ట్రీమింగ్ కు వస్తుండగా హిందీ వెర్షన్‌ మాత్రం ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ లో ఇంగ్లీష్ సబ్ టైటిల్స్‌తో స్ట్రీమింగ్ కానుంది. ఓటీటీ రైట్స్‌ను సుమారు రూ. 378 కోట్ల భారీ మొత్తానికి ఈ రెండు ప్లాట్ ఫామ్స్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version