TS: ప్రజాపాలన దరఖాస్తులపై సీఎం రేవంత్రెడ్డి సమీక్ష నిర్వహించారు.ప్రజాపాలనకు సంబంధించిన దరఖాస్తులను మరోసారి పరిశీలించాలని సీఎం ఆదేశించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు,ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి సచివాలయంలో సమావేశమయ్యారు. కేంద్ర కేబినెట్ సబ్ కమిటీతో కలిసి ప్రజా పాలన దరఖాస్తులపై సీఎం రివ్యూ నిర్వహించారు.
మొత్తం 1,09,01,255 దరఖాస్తులు రాగా అందులో డూప్లికేట్వి 2.82 లక్షల దరఖాస్తులు ఉన్నట్లు గుర్తించారు. కొందరు రేషన్ కార్డు, ఆధార్ కార్డు నంబర్లు నమోదు చేయలేదని, మరికొందరు తప్పుగా రాసినట్లు తేలింది అని తెలిపారు. అయితే అర్హులు నష్టపోకుండా ఉండేందుకు వాటిని మరోసారి పరిశీలించాలని సీఎం అధికారులను ఆదేశించారు.వచ్చిన దరఖాస్తుల్లో కొందరు ఒకే పేరుతో రెండు మూడు అప్లికేషన్స్ ఇచ్చారని పేర్కొన్నారు. దరఖాస్తు చేసిన వారిలో అర్హులైన వారందరూ లబ్ధి పొందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.దరఖాస్తు చేయని వారుంటే వారికి మళ్లీ దరఖాస్తు చేసే అవకాశం కల్పించాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు.