భార్యను సంతోషంగా ఉంచాలంటే ఇలా రాత్రి ఈ చిన్న పని చేయండి

-

చాలా మంది మగవాళ్ల సమస్య ఏంటంటే.. భార్యలను ఎలా మంచి మూడ్‌లో పెట్టాలో, వాళ్లను ఎలా హ్యాపీగా ఉంచాలో అర్థంకాకపోవడమే. వారిని సంతోషంగా ఉంచడం పెద్ద కష్టమేమీ కాదు. ఎందుకంటే సాధారణంగా మహిళలు చిన్న చిన్న విషయాలనే ఆశిస్తారు. మగవారికి ఇది అర్థం కాదు. భర్త చిన్న చిన్న పనులు చేస్తే, నీలాంటి జీవిత భాగస్వామిని పొందడం ఆమె అదృష్టంగా భావిస్తుంది. ఖరీదైన గిఫ్ట్‌లు ఇస్తేనే భార్యలు హ్యాపీగా ఉంటారు అనుకోవడం పొరపాటు. వారితో కలిసి ఈ ఐదు పనులు చేయండి. మీ భార్య ఫుల్‌ కుష్‌ అవుతుంది. మీ భార్య కోసం మీరు చేసే చిన్న చిన్న పనులు లోపలి నుండి వారిని సంతోషపరుస్తుంది, ఇది బయటి నుండి కూడా ప్రతిబింబిస్తుంది. రాత్రి పడుకునే ముందు మీ భార్యతో ఇలా చేయండి..

మీ భార్యతో మాట్లాడండి.. మీ రోజు ఎలా ఉందో చెప్పండి

బాగా అలిసిపోయాను త్వరగా ఫుడ్‌ పెట్టేసే.. తిని నిద్రపోతాను, ఇప్పుడు నాతో మాట్లాడకు, వినే మూడ్ లేదు అని తరచుగా భర్తలు భార్యలతో చెప్పే మాటలు ఇవి. వాళ్లు మీ కోసం ఉదయం నుంచి ఎదురుచూస్తారు, చాలా విషయాలు చెప్పాలి అనుకుంటారు, మీరు ఇలా అంటే వాళ్లకు బాధేస్తుంది. ఆఫీస్ వర్క్ వల్ల ఎవరైనా బాగా అలిసిపోతారు. ఇంటిని చూసుకునే భార్య కూడా రోజూ అన్ని బాధ్యతలు నిర్వహించి అలసిపోయిందనే విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు. కాబట్టి వారు ఇంటికి వచ్చిన వెంటనే వారిపై కేకలు వేయకుండా, వారి రోజు ఎలా గడిచిందో, మీకు ఎలా గడిచిందో ఒకరితో ఒకరు ముచ్చటించండి. భార్య తన సమస్య గురించి చెప్పడానికి వస్తే, దానిని తోసిపుచ్చే బదులు, ఒకరితో ఒకరు మాట్లాడి పరిష్కారం కనుగొనడానికి ప్రయత్నించండి. అలాంటివి ఉన్నా లేకపోయినా భార్యతో కాసేపు మాట్లాడటంలో తప్పులేదు.

హోమ్‌వర్క్‌లో సహాయం

రాత్రి పడుకునే ముందు, భార్య ఎప్పుడూ వంటగదిలో అన్ని వస్తువులను సర్దుకుని, ఏదో ఒక పని చేస్తుంటుంది. ఈ విషయంలో మీరు వారికి ఎందుకు సహాయం చేయకూడదు? భార్య వంటగదిని నిర్వహిస్తే ఇంట్లో మిగిలిన వస్తువులను చక్కదిద్దే బాధ్యత మీరు తీసుకోండి. ఇలా చేయడం ద్వారా, పని కూడా త్వరగా ముగుస్తుంది. మీ ఇద్దరికీ కూర్చుని మాట్లాడుకోవడానికి సమయం లభిస్తుంది. ఈ సమయం జంటకు చాలా ముఖ్యమైనది.

సర్ప్రైజ్ ఇవ్వండి

భార్య ఎంత అలసిపోయినా, ఎంత దుర్భరమైన రోజైనా సరే, భర్త ఒక్క గులాబీని తీసుకువస్తే, భార్య మూడ్ మొత్తం మారిపోతుంది. ఈ చిన్న చిన్న విషయాలు రోజంతా జరిగిన వాటిని మరచిపోవడానికి మరియు హృదయాన్ని సంతోషపెట్టడానికి సహాయపడతాయి. ఆమె దీన్ని గుర్తుంచుకుంటుంది మరియు మిమ్మల్ని సంతోషంగా ఉంచడానికి ఆమె ఏదో ఒక విధంగా ప్రయత్నిస్తూ ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version