రాష్ట్రంలో మూసీ నది శుద్ధీకరణ, పునరుజ్జీవంపై తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. ఈ మేరకు శుక్రవారం బంజారాహిల్స్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో మూసీ పునరుజ్జీవనంపై అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.
ఈ సమావేశానికి ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, శ్రీనివాసరాజు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఇప్పటివరకు మూసీ శుద్ధీకరణ కోసం అధికారులు తీసుకున్న చర్యలు, ప్రణాళికలన సీఎం రేవంత్ దృష్టికి అధికారులు తీసుకువచ్చినట్లు తెలిసింది. ఇదిలాఉండగా, గుజరాత్ లోని సబర్మతి నది శుద్దీకరణ తీరును ఇటీవల మంత్రి పొన్నం, పీసీసీ చీఫ్ పరిశీలించగా.. త్వరలోనే జీహెచ్ఎంసీ కార్పొరేటర్లకు సైతం చూపించి శుద్ధీకరణ ప్రారంభించనున్నట్లు సమాచారం.
బంజారాహిల్స్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో మూసీ పునరుజ్జీవనంపై అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష.
హాజరైన ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, శ్రీనివాసరాజు, ఉన్నతాధికారులు. pic.twitter.com/0rlGAVW5Xs
— ChotaNews App (@ChotaNewsApp) April 11, 2025