నేడు నాగర్‌కర్నూల్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. జటప్రోలులో మదనగోపాల స్వామి ఆలయాన్ని సందర్శించనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు.

అనంతరం బహిరంగ సభలో పాల్గొననున్నారు రేవంత్ రెడ్డి. ఇక అటు తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రేవంత్ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. తాజాగా జడ్పిటిసి, ఎంపీటీసీ స్థానాలు ఖరారు చేసిన సంగతి తెలిసిందే. అయితే పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేవరకు గ్రామాలు, వార్డులు మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయని అధికారులు స్పష్టం చేశారు.