కూటమి నేతలకు గుడ్ న్యూస్… 66 నామినేటెడ్ పదవుల భర్తీ

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కూటమి నేతలకు అదిరిపోయే శుభవార్త అందింది. నామినేటెడ్ పోస్టుల భర్తీకి మరోసారి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈసారి 66 అగ్రికల్చర్ మార్కెట్ కమిటీలు ఖరారు అయ్యాయి. ఈ 66 అగ్రికల్చర్ మార్కెట్ కమిటీలను మూడు పార్టీలు పంచుకున్నాయి. ఇందులో టీడీపీకి 53, జనసేన నుంచి 9 మంది… భారతీయ జనతా పార్టీ నుంచి నలుగురు చైర్మన్లుగా అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

tdp, janasena, bjp, AP
tdp, janasena, bjp, AP

 

66 చైర్మన్ పదవులలో 17 మంది బీసీలకు ఛాన్స్ ఇవ్వనున్నారు. ఎస్సీలకు పది పోస్టులు, ఎస్టీలకు 5, ఐదు మైనార్టీలకు ఛాన్స్ దక్కనుంది. 66 మార్కెట్ కమిటీ చైర్మన్ లలో 35 చోట్ల మహిళలకు అవకాశం ఇవ్వనున్నారు. ఇక నామినేటెడ్ పదవుల భర్తీ జరుగుతున్న నేపథ్యంలో కూటమి నేతలు సంతోషంగా ఉన్నారు.

  • ఏపీలో మరో దఫా నామినేటెడ్ పదవుల భర్తీ
  • 66 అగ్రీకల్చర్ మార్కెట్ కమిటీలు ఖరారు
  • జనసేన నుంచి 9, బీజేపీ నుంచి 4 ఛైర్మన్ లుగా అవకాశం
  • 66 ఛైర్మన్ పదవుల్లో 17 మంది బీసీలకు, 10 మంది ఎస్సీలకు, 5 మంది ఎస్టీలకు, 5 మంది మైనార్టీలకు చోటు
  • 66 మార్కెట్ కమిటీ ఛైర్మన్లలో 35 చోట్ల మహిళలకు ఛాన్స్

Read more RELATED
Recommended to you

Latest news