ఇవాళ 206 అంబులెన్స్‌లు ప్రారంభం కానున్నాయి. ఇవాళ సాయంత్రం 4 గంటలకు అంబేడ్కర్ విగ్రహం దగ్గర ప్రజా పాలనా సభలో సీఎం రేవంత్ పాల్గొంటారు. ప్రజాపాలన వేడుకల్లో భాగంగా 206 అంబులెన్స్‌లు ప్రారంభం కానున్నాయి. సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్ చేతుల మీదుగా అంబులెన్స్‌లు ప్రారంభం అవుతాయి. 442 సివిల్ అసిస్టెన్స్ సర్జెన్స్, 24 ఫుడ్ సేఫ్టీ అధికారులకు పోస్టింగ్స్ ఇస్తారు. 16 నర్సింగ్ కాలేజీలు, 28 పారామెడికల్ కాలేజీలు మంజూరు చేయనున్నారు.
ఇక అటు మధ్యాహ్నం 1.30కు ముఖ్యమంత్రి బేగంపేట నుంచి హెలికాప్టర్లో సిద్ధిపేటకు బయల్దేరుతారు సీఎం రేవంత్. సిద్దిపేట జిల్లా బండ తిమ్మాపూర్ వద్ద HCCB – కోకా కోలా ఫ్యాక్టరీకి చేరుకుంటారు. మధ్యాహ్నం 2 గంటలకు కోకాకోలా ఫ్యాక్టరీ ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. 3 గంటలకు తిరిగి హైదరాబాద్‌కు బయల్దేరుతారు. 3.30 కు ఎన్టీఆర్ మార్గ్‌లోని హెచ్ఎండీఏ గ్రౌండ్స్‌లో ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా నిర్వహించే ఆరోగ్య ఉత్సవాలలో పాల్గొంటారు.