నేడు హోలీ పండుగ కావడంతో దేశవ్యాప్తంగా ప్రజలు సంబురాలను జరుపుకుంటున్నారు. అయితే, హోలీ పండుగ దక్షిణాదితో పోలిస్తే ఉత్తర భారత ప్రజలు ఘనంగా జరుపుకుంటుంటారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చిన్న పెద్దా కలిసి రంగులను పూసుకుని పండుగను ఎంజాయ్ చేస్తుంటారు.
ఈ క్రమంలోనే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు హోలీ పండుగ సందర్భంగా సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ‘సప్తవర్ణ శోభితం.. సకల జనుల సంబురం.. ప్రజలందరికీ హోలీ శుభాకాంక్షలు’ అంటూ ఆయన ట్వీట్ చేశారు. రంగుల పండుగను వైభవోపేతంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. కులమతాలకు అతీతంగా అన్ని వర్గాలు జరుపుకునే హోలీ సమైక్యతకు అద్దం పడుతుందని అభివర్ణించారు.
సప్తవర్ణ శోభితం…
సకల జనుల సంబురం.ప్రజలందరికి హోళీ శుభాకాంక్షలు. #happyholi2025 #Holi #Holi2025 pic.twitter.com/dpvXrXpZBY
— Revanth Reddy (@revanth_anumula) March 14, 2025