గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని జూబ్లీహిల్స్‌లో సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఇంటి ఎదురుగా ఓ కారు బీభత్సం సృష్టంచింది. శుక్రవారం ఉదయం ఈ ఘటన వెలుగుచూడగా.. స్థానికులు, పాదాచారులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
వేగంగా దూసుకొచ్చిన కారు బాలకృష్ణ ఇంటి ఎదురుగా ఉన్న ఫెన్సింగ్‌ను ఢీకొట్టినట్లు సమాచారం. అయితే, కారు డ్రైవర్ నిద్ర మత్తులో ఉండటం వల్లే ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి ప్రమాదం చోటుచేసుకోలేదు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.