దేవుడి ఫొటోల వద్ద సీఎం రేవంత్ చిత్రపటం.. కుమారి ఆంటీ ఏమన్నదంటే?

-

ఫుట్ పాత్ వద్ద హోటల్ నడిపించే కుమారీ ఆంటీ సోషల్ మీడియాలో ఒక్కసారిగా వైరల్ అయిన విషయం తెలిసిందే. గతంలో ఆమె హోటల్‌ను తొలగించవద్దని సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా ఆదేశించారు. అంతేకాకుండా అటు వైపు వెళ్లినప్పుడు ఆమె చేతి వంట రుచి చూస్తానని చెప్పడంతో మీడియా మొత్తం ఆమెను హైలెట్ చేసింది.

ఈ క్రమంలో ఆ హోటల్ మినహాయించి ఆధికారులు మిగతా వారి దుకాణాలను తొలగించారు. దీంతో సీఎం రేవంత్ రెడ్డి దేవుడిగా కుమారి ఆంటీ పూజిస్తున్నట్లు తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి ఫోటోని దేవుడి గదిలో పెట్టి పూజిస్తున్న కుమారి ఆంటీ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news