టీటీడీ బోర్డు మెంబర్ తిట్ల దండకం.. థర్డ్ క్లాస్ నా కొడకా అంటూ..

-

తిరుమలలో ఇటీవలి కాలంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేస్తున్న కొందరు ఉద్యోగులు రెచ్చిపోతున్నారు. వీఐపీ కల్చర్ కూడా బాగా పెరిగిపోయింది. ఫలితంగా సామాన్య భక్తులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే నిబంధనలు పాటించాలని చెప్పినందుకు టీటీడీ ఉద్యోగిని బోర్డు మెంబర్ ఇష్టానుసారంగా బూతులు తిట్టాడు.

నిబంధనలు ప్రకారం బయటికు వెళ్లాలని చెప్పిన పాపానికి “ఎవ‌డ్రా నువ్వు…పోరా బ‌య‌టికి.. థ‌ర్డ్ క్లాస్ నా కొడ‌కా…ఫ‌స్ట్ బ‌య‌టికి పంపండి. లేకుంటే ఇక్క‌డే కూర్చుంటా” అంటూ శ్రీవారి గుడి ప్రాంగణంలోనే తిట్ల దండకం మొదలెట్టాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news