సీఎం రేవంత్ రెడ్డి యాదగిరిగుట్టకు చేరుకున్నారు. తన పుట్టినరోజు సందర్భంగా యాదాద్రికి శ్రీలక్ష్మి నరసింహ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆయన యాదాద్రి ఆలయంలో స్వామి వారిని దర్శనం చేసుకున్నాక.. ఆలయ అభివృద్ధిపై సమీక్ష నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. అనంతరం టెంపుల్ బోర్డు, గోపురానికి బంగారు తాపడం పనుల గురించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకోనున్నారు.
అనంతరం ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఆయన పర్యటిస్తారని తెలుస్తోంది. ఆయన పుట్టిన రోజు సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారని సమాచారం. ఇప్పటికే రేవంత్ పర్యటనకు సంబంధించి జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యేలు, స్థానిక కాంగ్రెస్ నేతలు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది.