ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఇంట్లో సూది కింద పడినా సరే తెలుగుదేశం నేతలు వారి అనుకూల మీడియా చేసే హడావుడి అంతా ఇంతా కాదు అనేదిఎవరూ కాదనలేని వాస్తవం. చిన్న వార్త వచ్చినా సరే టీడీపీ సోషల్ మీడియా వింగ్ మాత్రం ఎక్కువగా ప్రచారం చేస్తూ ఉంటుంది. ప్రస్తుతం జగన్ ఢిల్లీ పర్యటన తర్వాత మీడియాతో మాట్లాడటం గాని ఆ పర్యటనలో ఎం మాట్లాడారో చెప్పడం గాని లేదు.
దానికి తోడు సెర్బియా లో ఉన్న నిమ్మగడ్డ ప్రసాద్ అనే వ్యాపారవేత్త విషయంలో కాస్త గల్ఫ్ దేశం రస్ అల్ ఖైమా కాస్త దూకుడుగా ఉంది. ఈ నేపధ్యంలో జగన్ ని అరెస్ట్ చేసే అవకాసం ఉందని, అందుకే జగన్ ఢిల్లీ వెళ్లి తనను అరెస్ట్ చేయవద్దని కోరారని అంటూ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ నేపధ్యంలోనే ముఖ్యమంత్రి జగన్ తర్వాత ఆ బాధ్యతలను చేపట్టేది ఎవరూ అనే చర్చలు జరుగుతున్నాయి.
ఈ నేపధ్యంలో టీడీపీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ సంచలన వ్యాఖ్యలు చేసారు. జగన్ జైలుకు వెళితే ముఖ్యమంత్రి కావాలని చాలామంది పోటీపడుతున్నారని, రోజా, బొత్స, షర్మిల, విజయలక్ష్మి, భారతి సహా.. ఈ లిస్టులో చాలా మంది ఉన్నారని ఆమె వ్యాఖ్యానించారు. రోజా మాట తీరు మహిళలు సిగ్గుపడే విధంగా ఉందని విమర్శించారు. గుంటూరు జిల్లాలో రాజధాని ఉద్యమానికి ఆమె మద్దతు పలికారు.
ఈ సందర్భంగా అనురాధ కీలక వ్యాఖ్యలు చేసారు. వేరే దేశం వాళ్లు ఏ-3 ముద్దాయి నిమ్మగడ్డ ప్రసాద్‌ను అరెస్టు చేశారన్న ఆమె, ఏ-1 ముద్దాయి జగన్మోహన్ రెడ్డి ఇక్కడే ఉన్నారని, ఈయన త్వరలోనే జైలుకు వెళతారని అంతా అనుకుంటున్నారని… జగన్ జైలుకు వెళితే.. ఏపీ సీఎం ఎవరన్నదానిపై చర్చ జరుగుతోందన్నారు. కాగా సోషల్ మీడియాలో కూడా దీనిపై చర్చలు ఎక్కువగానే జరుగుతున్నాయి.