సమ్‌థింగ్ స్పెషల్: తండావాసులతో ఖోఖో ఆడిన కలెక్టర్

-

కలెక్టర్.. ఎప్పుడూ మీటింగ్స్, పనులు, పరిశీలనలు.. తదితర పనులతో ఫుల్ బిజీగా ఉంటారు. అయితే వీరికి ఖాళీ టైం దొరకడమే అరుదు. ఉన్న టైంలోనే పనితోపాటు ఎంజాయ్‌మెంట్‌ను కోరుకుంటారు. పనిలోనే సంతోషాన్ని, సరదాలను వెతుకుతుంటారు. అలా ఓ కలెక్టర్ తండాల్లో పర్యటించి సందడి చేశారు. తండావాసులతో కలిసి ఖోఖో ఆడి.. అందరినీ అలరించారు. యాదాద్రి జిల్లా బీబీనగర్ మండలం మీది తండాలో ఏర్పాటు చేసిన తెలంగాణ క్రీడా ప్రాంగణాన్ని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డితో కలిసి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి శుక్రవారం ప్రారంభించారు.

కలెక్టర్ పమేలా సత్పతి

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పల్లె ప్రగతిపై తండాలు, గ్రామాల్లో అవగాహన పెరిగిందన్నారు. పర్యావరణ పరిశుభ్రత, మొక్కల పెంపకంతో ఎటూ చూసినా వాతావరణం ఆహ్లాదకరంగా ఉందన్నారు. గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాలు, క్రీడా మైదానాలు, నర్సరీల నిర్మాణాలకు గ్రామస్థులు అన్ని అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. యువత కోసం క్రీడా మైదానం ఏర్పాటు చేశామన్నారు. సెలవు రోజుల్లో ఆట స్థలాన్ని ఉపయోగించుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ స్థానికులతో కలిసి ఖోఖో ఆడారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version