తెలంగాణలో మరో అరుదైన ఘటన..గవర్నమెంట్ ఆసుపత్రిలో కలెక్టర్ భార్య ప్రసవం

-

కలెక్టర్ భవేష్ మిశ్రా భార్య, ములుగు జిల్లా అడిషనల్ కలెక్టర్ ఇలా త్రిపాఠి సోమవారం రాత్రి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏరియాస్పత్రిలో ప్రసవించారు. సోమవారం మధ్యాహ్నం పురిటి నొప్పులు రావడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చి అడ్మిట్ చేశారు ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ సంజీవయ్య ఆధ్వర్యంలో సాధారణ డెలివరీ కోసం ప్రయత్నించినప్పటికీ శిశువు బరువు ఎక్కువగా ఉండటంతో సాధారణ డెలివరీ చేయడం సాధ్యం కాలేకపోయిందని సూపరిండెంట్ తెలిపారు.

హాస్పటల్లో గైనకాలజిస్ట్ డాక్టర్లు శ్రీదేవి,లావణ్య,సంధ్యారాణి,విద్య ఆపరేషన్ చేసి డెలివరీ చేశారు. ఇలా త్రిపాఠి పండంటి మగ శిశువుకు జన్మనిచ్చింది. శిశువు 3.400కిలోల బరువుతో పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు సూపరింటెండెంట్ తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీ చేయించి జిల్లా ప్రజలకు కలెక్టర్ దంపతులు ఆదర్శంగా నిలిచారు.జిల్లా కలెక్టర్ భవ్యష్ మిశ్రా బాధితుల స్వీకరించిన నాటి నుంచి ఆసుపత్రి అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడుతున్నారు.ఆసుపత్రిలో సౌకర్యాలు డాక్టర్ల పెంపు గురించి వైద్య అధికారులతో చర్చిస్తూ రాష్ట్రస్థాయి అధికారులకు తెలియపరుస్తూ ఆస్పత్రిలో అన్ని రకాల వైద్య సేవలను ప్రారంభించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version