ఆ హిట్ సినిమాలు నేనే చేయాల్సింది కానీ.. కలర్ ఫోటో హీరోయిన్ ఆసక్తికర వ్యాఖ్యలు..!

-

తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమై ఎన్నో ఏళ్ళు గడిచి పోతున్నప్పటికీ ఇటీవలే విడుదలైన కలర్ ఫోటో సినిమాతో మాత్రం తెలుగు ప్రేక్షకులందరికీ సుపరిచితులి గా మారిపోయింది హీరోయిన్ చాందినీ చౌదరి. లఘు చిత్రాలతో తన నట ప్రస్థానం మొదలుపెట్టిన చాందిని చౌదరి ఆ తర్వాత కేటుగాడు సినిమాల్లో అవకాశాలు దక్కించుకుని టాలీవుడ్లోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది అన్న విషయం తెలిసిందే. తనకు సరైన గుర్తింపు తీసుకు వచ్చే విజయం కోసం ఎన్నో రోజుల నుంచి ఎదురుచూస్తున్న ఈ అమ్మడు ఇటీవలే కలర్ ఫోటో సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది అన్న విషయం తెలిసిందే.

సుహాస్ హీరోగా నటించిన సినిమాలో దీప్తి వర్మ అనే పాత్రలో నటించింది చాందినీ చౌదరి. సినిమా ఓటిటి వేదికగా విడుదల అయినప్పటికీ అనూహ్య విజయాన్ని సాధించింది. ఇక ఇటీవలే తన కెరీర్ గురించి ఆసక్తికర విషయాలు అభిమానులతో పంచుకున్నది ఈ అమ్మడు. ఎన్నో సినిమాల్లో నటించినప్పటికీ మంచి గుర్తింపు రాలేదని కానీ కలర్ ఫొటో సినిమాతో గుర్తింపు సంపాదించాను అంటూ చెప్పుకొచ్చింది. ఇప్పటివరకు ఎన్నో హిట్ అయిన సినిమాలు కూడా తన వద్దకు అవకాశాలు వచ్చాయని కానీ.. ఓ పెద్ద నిర్మాత దగ్గర కాంట్రాక్టు లో ఉండడంతో ఆ సినిమాలు చేయలేక పోయాను అంటూ తెలిపింది. కుమారి 21ఎఫ్, పటాస్ లాంటి సినిమాల్లో అవకాశాలు వచ్చినట్లు తెలిపింది ఈ అమ్మడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version