ఇళ్ళకు వచ్చి ఎయిడ్స్ ఇంజెక్షన్లు చేస్తున్నారు, సోషల్ మీడియాను ఊపేస్తున్న పోస్ట్…!

-

ఈ మధ్య ఉగ్రవాదులు కొత్త కొత్త మార్గాల్లో మనుషుల ప్రాణాలు తీయడానికి సిద్దమవుతున్న సంగతి తెలిసిందే. బాంబుల విషయంలో ప్రభుత్వాలు అప్రమత్తంగా వ్యవహరిస్తున్న నేపధ్యంలో సరికొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. మనుషుల ప్రాణాలను తీయడమే లక్ష్యంగా వాళ్ళు పని చేయడంతో ఏ వైపు నుంచి అయినా సరే ప్రమాదం ముంచుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి అనేది అర్ధమవుతుంది.

ఈ నేపధ్యంలో సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వైరల్ అవుతుంది. ఎవరైనా మీ ఇంటి దగ్గరకు వచ్చి, మేము ప్రభుత్వ ఆస్పత్రి నుంచి వచ్చాము, ఇన్సులిన్, విటమిన్స్ ఇంజక్షన్ చేస్తాము అని చెప్తే తొందరపడి చేయించుకోవద్దు. టెర్రరిస్ట్ గ్రూపు ఈ విధంగా వచ్చి ఎయిడ్స్ ఇంజెక్షన్ వేస్తున్నారంట. జాగ్రత్త మీకు సంబంధించిన అన్ని గ్రూప్ లకు ఈ సమాహారం పంపండి.

ఈ సమాచారాన్ని మీ బంధు మిత్రులు అందరికి పంపి నేరాల నియంత్రణకు పోలీసు వారికి సహకరించండి” ఇట్లు విజయవాడ సిటీ పోలీసు. ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్న పోస్ట్ ఇది. వాట్సాప్ గ్రూప్ లతో పాటుగా పలువురి ఫేస్బుక్ ఖాతాల్లో ఈ పోస్ట్ దర్శనం ఇస్తుంది. ఇది ఎంత వరకు నిజమో గాని ఇప్పుడు దీన్ని జనం నమ్ముతున్నారు. ఎందుకైనా మంచిది జాగ్రత్తగా ఉండండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version