అవే చెయ్యకూడని తప్పులు చేస్తోన్న పవన్ కల్యాణ్ !!

-

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఉన్న గాని టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర తనకున్న క్రేజ్ ఇంచు కూడా తగ్గలేదు. ఇటీవల దాదాపు రెండు సంవత్సరాల తర్వాత రాజకీయ రంగం నుంచి సినిమా రంగంలోకి రీ ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఓ బాలీవుడ్ రీమేక్ సినిమా చేసిన విషయం అందరికీ తెలిసినదే. అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేస్తున్న రీమేక్ సినిమా గురించి సొంత అభిమానులు చాలా నిరుత్సాహం చెందుతున్నట్లు అలాగే ఇండస్ట్రీలో కూడా పవన్ కళ్యాణ్ ఇలాంటి సబ్జెక్ట్ అనవసరంగా సెలక్ట్ చేసుకున్నట్లు అతని ఇమేజ్ కి సరైన సబ్జెక్ట్ కాదని అసలు రీమేక్ పవన్ కళ్యాణ్ ని ఎందుకు చేస్తున్నారని గతంలో చేసిన తప్పులు మళ్ళీ ఇప్పుడు చేస్తున్నారని కామెంటు వినబడుతున్నాయి.

గతంలో పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ అదేవిధంగా కాటమరాయుడు లాంటి సినిమాలను రీమేక్ చేసి దారుణమైన పరాజయాలు తన కెరియర్ లో చూడటం జరిగింది. ఇటువంటి తరుణంలో మెసేజ్ ఓరియంటెడ్ టైప్ పైగా బాలీవుడ్ రీమేక్ సినిమానే పవన్ కళ్యాణ్ ని ఎంచుకోవడం పట్ల చాలా మంది అభిమానులు నిరుత్సాహం చెందుతున్నారు.

 

కమర్షియల్ నేపథ్యం కలిగిన హరీష్ శంకర్ లాంటి డైరెక్టర్లు కలిగిన ఇండస్ట్రీలో వాళ్లు చెప్పిన కథలను పక్కన పెట్టి పవన్ కళ్యాణ్ వేణు శ్రీరామ్ మరియు తాజాగా క్రిష్ లాంటి డైరెక్టర్లతో పని చేయడం పట్ల అనవసరంగా పవన్ కళ్యాణ్ తప్పులు చేస్తున్నారని అతని ఇమేజ్ కి క్రేజీ కి తగ్గ డైరెక్టర్లు కాదు వీళ్ళు అంటూ ఇండస్ట్రీలో చాలామంది ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేయబోతున్న సినిమాల పై కామెంట్ చేస్తున్నారు. 

Read more RELATED
Recommended to you

Exit mobile version